రు. 2014 డీఎస్సీలో ఎంపికైన 200 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ ప్లేస్ లేకపోవడంతో జీతాల విడుదలకు సంబంధించి ఇబ్బంది ఉందని అన్నారు. వచ్చే నెలలో జీతాలు విడుదల చేస్తామన్నారు. జిల్లాలోని 400 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు అవకాశం ఉందన్నారు. అయి
కొత్త ఉపాధ్యాయులకు త్వరలో జీతాలు
Aug 21 2016 12:06 AM | Updated on Sep 4 2017 10:06 AM
	రంపచోడవరం : డీఈఓ పూల్ ద్వారా 2014 డీఎస్సీలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు త్వరలో జీతాలు విడుదలవుతాయని డీఈఓ ఆర్.నరసింహరావు తెలిపారు. పాఠశాలల్లో రసాయన రహిత పోషక విలువలతో కూడిన కూరగాయల పెంపకంపై మండల రీసోర్స్ సెంటర్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు శనివారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2014 డీఎస్సీలో ఎంపికైన 200 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ ప్లేస్ లేకపోవడంతో జీతాల విడుదలకు సంబంధించి ఇబ్బంది ఉందని అన్నారు. వచ్చే నెలలో జీతాలు విడుదల చేస్తామన్నారు. జిల్లాలోని 400 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు అవకాశం ఉందన్నారు. అయితే నిధుల కొరతతో కంప్యూటర్ బోధకులను నియమించకపోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడం లేదన్నారు. జిల్లా పరిషత్ నుంచి నిధులిస్తే ఔట్‌సోర్సింగ్ ద్వారా కంప్యూటర్ విద్యాబోధన సాధ్యమవుతుందన్నారు. పాఠశాలల వాచ్‌మన్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో నిధులు సమకూర్చుకుని వాచ్‌మన్‌ను నియమించుకోవాలని ఆయన సూచించారు.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
