
ఏం ‘బాబయ్యా’ ... కొత్త పంచాయితీ పెడితిరి!
తెలంగాణ తమ్ముళ్ల పరిస్థితి ‘కక్క లేక.. మింగలేక’ అన్న చందంగా తయారైంది. ఉప్పు, నిప్పులా ఉండే నేతలకు సమానా హోదా కలిగిన
అంతా పనిచేస్తే.. ఒక నాయకుడికే పేరొస్తుందని వెనుక దాక్కున్న నేతల్ని అధినేత మందలించాక కానీ ముందుకు వెళ్లలేదు. అయితే వరంగల్‌లో ఎన్డీయే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే పేరొచ్చేది ఆ జిల్లాకు చెందిన నేతకే కదా అని వీరు వెనక్కి త గ్గారట. అధ్యక్షుడు.. వర్కింగ్ ప్రెసిడెంట్.. టీడీఎల్పీ నేత ఇలా.. పదవుల్లో ఉన్న నేతలు ఉమ్మడిగా కాకుండా ఎవరికి ఉనికి కోసం వారు పాకులాడడంతో.. అసలుకే ఎసరు వచ్చేలా ఉందే అన్న ఆందోళన కింది స్థాయి శ్రేణులను భయపెడుతోంది. అందరికీ ముఖ్య పదవులిచ్చి లేనిపోని పంచాయితీ పెట్టారని వాపోతున్న తమ్ముళ్లను సముదాయించే వారే లేకుండా పోయారు!!