ముస్తాబవుతున్న కార్యాలయాలు | new buildings ready for government | Sakshi
Sakshi News home page

ముస్తాబవుతున్న కార్యాలయాలు

Oct 8 2016 4:35 PM | Updated on Sep 4 2017 4:40 PM

అల్లాదుర్గంలో నూతన సీఐ కార్యాలయం వద్ద జరుగుతున్న పనులు

అల్లాదుర్గంలో నూతన సీఐ కార్యాలయం వద్ద జరుగుతున్న పనులు

వట్‌పల్లి గ్రామాన్ని ప్రభుత్వం నూతన మండలం చేయడంతో కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు.

అల్లాదుర్గం: వట్‌పల్లి గ్రామాన్ని ప్రభుత్వం నూతన మండలం చేయడంతో కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. మార్కెట్‌ యార్డులో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయాల కోసం భవనాలను ఎంపిక చేశారు. భవనాల్లో తాత్కాలికంగా ఫర్నిచర్, బోర్డులను రాశారు.

శనివారం జోగిపేట సీఐ వెంకటయ్య పోలీస్‌ స్టేషన్‌కు కేటాయించిన భవనంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అల్లాదుర్గంలో పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం కోసం కేటాయించిన హౌసింగ్‌ భవనంలో ఏర్పాట్లు చేపట్టారు. భవనం చుట్టూ పొదలు తొలగించారు. ముందు భాగంలో చదును చేశారు. కార్యాలయాల ప్రారంభం కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement