జిల్లాలో 268 పంచాయతీలకు, 806 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు చెప్పారు. మంగళవారం ఆయన పి.గన్నవరంలో విలేకరులతో మాట్లాడుతూ 248 శ్మశాన వాటికల అభివృద్ధికీ నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఒక్కొక్క పంచాయతీ భవనానికి రూ.13.5 లక్షలు, అంగన్‌వాడీ భవనానికి రూ.6.5 లక్షలు, శ్మశాన వాటికల అభివృద్ధికి కూ.10 లక్షల వంతున నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఉపాధిహామీ పథకం, 14వ
పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు
Oct 18 2016 10:18 PM | Updated on Oct 4 2018 5:35 PM
పి.గన్నవరం :
జిల్లాలో 268 పంచాయతీలకు, 806 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు చెప్పారు. మంగళవారం ఆయన పి.గన్నవరంలో విలేకరులతో మాట్లాడుతూ 248 శ్మశాన వాటికల అభివృద్ధికీ నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఒక్కొక్క పంచాయతీ భవనానికి రూ.13.5 లక్షలు, అంగన్‌వాడీ భవనానికి రూ.6.5 లక్షలు, శ్మశాన వాటికల అభివృద్ధికి కూ.10 లక్షల వంతున నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఉపాధిహామీ పథకం, 14వ ఆర్థిక సంఘం మ్యాచింగ్ నిధులతో జిల్లాలో ఇప్పటికి 266 కి.మీ. మేరకు సీసీ రోడ్లు నిర్మించినట్టు తెలిపారు. వచ్చే మార్చి నాటికి 500 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికి 139 ఓడీఎఫ్ గ్రామాలు పూర్తయ్యాయన్నారు. డిసెంబర్ తర్వాత కొత్త ఓడీఎఫ్ గ్రామాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడంలో రాష్ట్రంలో మన జిల్లా ద్వితీయ స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని 1,069 గ్రామాల్లో ‘చెత్త నుంచి సంపద సేకరణ’ యార్డుల నిర్మాణానికి స్థల సేకరణకు కృషి చేస్తున్నామని తెలిపారు.
Advertisement
Advertisement