ఆలయ ఆస్తులనే అమ్మేసిన టీడీపీ నేత | nellore tdp leader sold temple properties | Sakshi
Sakshi News home page

ఆలయ ఆస్తులనే అమ్మేసిన టీడీపీ నేత

Apr 12 2016 8:47 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల దోపిడికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేతలు అందినకాడికి దోచేస్తున్నారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల దోపిడికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేతలు అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా రూరల్ మండలానికి చెందిన స్థానిక టీడీపీ నేత ఏకంగా ఆలయ ఆస్తులనే విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నరసింహస్వామి ఆలయ భూముల్లో ఉన్న టేకు చెట్లను సదరు టీడీపీ నేత అక్రమంగా విక్రయించాడు. దీనిపై ఆలయ ఈవో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. అధికార పార్టీ నేతల తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement