ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు | navodaya entrance exam finish | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు

Jan 8 2017 10:37 PM | Updated on Sep 5 2018 8:36 PM

నవోదయ పాఠశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం జిల్లావ్యాప్తంగా 17 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు సుమారు 7 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

హిందూపురం అర్బన్‌ : నవోదయ పాఠశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం జిల్లావ్యాప్తంగా 17 కేంద్రాల్లో  నిర్వహించిన పరీక్షలకు సుమారు 7 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. హిందూపురం నియోజవర్గంలో 623 మంది పరీక్ష రాశారు. హాల్‌టికెట్లు పొందిన వారిలో 47 మంది గైర్హాజరయ్యారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాలను ఎంఈఓ గంగప్ప పరిశీలించారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement