'వంద శాతం ముద్దాయి చంద్రబాబే' | naveenkumar reddy criticise chandra babu on cash for vote case | Sakshi
Sakshi News home page

'వంద శాతం ముద్దాయి చంద్రబాబే'

Sep 1 2016 2:28 PM | Updated on Sep 4 2017 11:52 AM

'వంద శాతం ముద్దాయి చంద్రబాబే'

'వంద శాతం ముద్దాయి చంద్రబాబే'

'ఓటుకు కోట్లు' కేసులో చంద్రబాబు వంద శాతం ముద్దాయేనని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు కోట్లు' కేసులో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వంద శాతం ముద్దాయేనని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణ జరుగుతున్న ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు.

అందులో భాగంగానే 'ఓటుకు కోట్లు' కేసు విచారణ నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. దమ్మూ, ధైర్యం ఉంటే ఈ కేసు విచారణను ఎదుర్కోవాలన్నారు. కరువు, చంద్రబాబు ఇద్దరూ కవలపిల్లల్లాంటి వాళ్లని ఎద్దేవాచేశారు. ఆయన ఎక్కడుంటే అక్కడ కరువు తాండవిస్తుందని నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement