నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య | narayana college student suicides in vijayawada | Sakshi
Sakshi News home page

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Sep 25 2015 8:00 PM | Updated on Nov 9 2018 4:36 PM

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య - Sakshi

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య

నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా విజయవాడలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విజయవాడ: నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా విజయవాడలో మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.  నారాయణ కాలేజీ నిడమానూరు క్యాంపస్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అఖిల్ రెడ్డి శుక్రవారం కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఒంగోలుకు చెందినవాడుగా సమాచారం. అఖిల్ రెడ్డి మృతదేహాన్ని కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతనెల 17వ తేదీ కడప నారాయణ కళాశాలలో మనీషారెడ్డి, నందిని అనే విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన  విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement