సత్యదేవుని సేవలో నైనా జైస్వాల్‌ | naina jaiswal at annavaram | Sakshi
Sakshi News home page

సత్యదేవుని సేవలో నైనా జైస్వాల్‌

Feb 12 2017 11:11 PM | Updated on Sep 5 2017 3:33 AM

సత్యదేవుని సేవలో నైనా జైస్వాల్‌

సత్యదేవుని సేవలో నైనా జైస్వాల్‌

అన్నవరం : ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ నైనా జైస్వాల్‌ ఆదివారం కుటుంబసభ్యులతో రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజ లు చేశారు. ఆల యం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించారు. దేవ

అన్నవరం : ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ నైనా జైస్వాల్‌ ఆదివారం కుటుంబసభ్యులతో రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజ లు చేశారు. ఆల యం వద్ద వారికి  అధికారులు   స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.  
13వ ఏటే డిగ్రీ పాసయ్యా 
ఈ సందర్భంగా నైనాజైస్వాల్‌ మాట్లాడుతూ తాను ఎనిమిదో ఏట పదో తరగతి, పదో ఏట ఇంటర్మీడియట్, 13 ఏట జర్నలిజంలో డిగ్రీ పాసయ్యానని తెలిపారు. తాను టేబుల్‌ టెన్నిస్‌లో ఇండియాలోనే నంబర్‌ వన్‌ ర్యాంకర్‌నని,   నేషనల్, సౌత్‌ ఏషియా చాంపియన్‌నని తెలిపారు. తాను రెండు చేతులతో రాస్తానని, రెండు సెకన్లలోనే ఇంగ్లిష్‌ అక్షరాలు ఏ టూ జెడ్‌ టైపు చేస్తానని తెలిపారు. ఇదంతా తాను ఇష్టపూర్వకంగా సాధన చేసి సాధించాను తప్ప కష్టపడి కాదన్నారు. విద్యార్థులు కూడా ఇష్టపడి చదివితేనే మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉజ్వల భవిష్యత్‌ పొందుతారన్నారు. తన సోదరుడు అగస్త్య జైస్వాల్‌ కూడా తనలానే ఇష్టపడి చదువుతాడని, అందువల్లే తొమ్మిదే ఏటే పదో తరగతి పాస్‌ అయ్యాడని, తను కూడా రెండు చేతులతో రాయగలడని తెలిపారు. తమ తల్లిదండ్రులు భాగ్యలక్షి, అశ్విని కుమార్‌ జైస్వాల్‌ ప్రేమాభిమానాలతో , ప్రోత్సాహంతో తాము ఈ విజయాలు సాధించగలిగామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement