మిస్టరీగా మారిన విద్యార్థి మరణం | mysterious death of student | Sakshi
Sakshi News home page

మిస్టరీగా మారిన విద్యార్థి మరణం

Aug 21 2016 10:33 PM | Updated on Nov 9 2018 5:02 PM

విశాఖలోని ఓ ప్రై వేట్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న కడప జిల్లాకు చెందిన విద్యార్థి మరణం మిస్టరీగా మారింది.

  • వెతుక్కుంటూ 50 రోజుల తర్వాత వచ్చిన అన్న
  • ఎప్పుడో చనిపోయాడని చెప్పిన పోలీస్‌
  • కళాశాల నిర్వాహకులే కారణంటూ ఫిర్యాదు
  • సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ఓ ప్రై వేట్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న కడప జిల్లాకు చెందిన విద్యార్థి మరణం మిస్టరీగా మారింది. యాభై రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చిన వాడు చనిపోయాడని పోలీసులు అతని దుస్తులు చూపించడంతో బయటపడింది. అయితే అతను ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, అతని చావుకు దారితీసిన పరిస్థితులేమిటనే ప్రశ్నలకు సమాధానం లేదు. మతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
    కడప జిల్లా సిద్ధిపేట మండలం, మాధవరం గ్రామానికి చెందిన ఎస్‌పి మనోజ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని  సింహాద్రి ఇంజనీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.గత నెల 1వ తేదీ ఉదయం స్వగ్రామం నుంచి బయలుదేరి 2వ తేదీ మధ్యాహ్నానికి కళాశాలకు చేరుకున్నాడు. రాగానే ఇంటికి ఫోన్‌ చేసి తాను క్షేమంగా చేరుకున్నానని తల్లికి చెప్పాడు. సాయంత్రం అతని క్లాస్‌మెట్‌ రాజేష్‌ వచ్చి పాటలు ఎక్కించుకోవడానికి మొబైల్‌ ఇవ్వమని అడగడంతో మనోజ్‌ ఇచ్చాడు. కానీ తర్వాత ఆ మొబైల్‌ కనిపించలేదు. రాజేష్‌ని అడిగితే మంచం వద్దనే పెట్టానని, ఏ మైందో తెలియది చెప్పాడు. మొబైల్‌ కోసం కాసేపు అంతటా వెదికిన మనోజ్‌ రాత్రి 7గంటల సమయంలో తాను బయటకు వెళుతున్నానని వాచ్‌మెన్‌కు చెప్పి వెళ్లాడు. అలా వెళ్లిన మనోజ్‌ తిరిగి రాలేదు. మరుసటి రోజు కాలేజ్‌కు రాకపోవడంతో మనోజ్‌ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం మొబైల్‌ ద్వారా మెసేజ్‌ పంపించారు. కానీ వారి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో దానిని గమనించలేదు. అదే రోజు కళాశాల పక్కనే ఉన్న ఓ నూతిలో యువకుడి మతదేహం లభ్యమైంది. దానిని కళాశాల నిర్వాహకులు చూసి మతుడి ఒంటిపై యూనిఫామ్‌ లేకపోవడంతో తమ కళాశాల విద్యార్థ్ధికాదని తేల్చారు. దాంతో సబ్బవరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొద్ది రోజులు ఉంచి సంబంధీకులెవరూ రాకపోవడంతో దహనం చేసేశారు. అయితే మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులను జాగ్రత్త పరిచారు.
    మనోజ్‌ నుంచి ఫోన్‌ రాకపోవడంతో తల్లడిల్లిన అతని తల్లిదండ్రులు ఏం జరిగిందో చూసిరమ్మని అతని అన్న మల్లేశ్వరరెడ్డికి,కొందరు బంధువులను తోడుగా ఇచ్చి కళాశాలకు పంపించారు. శని,ఆది వారాల్లో కళాశాలకు వెళ్లి మనోజ్‌ గురించి నిర్వాహకులను ఆరాతీస్తే ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దీంతో వారు సబ్బవరం పోలీసులను ఆశ్రయించారు. అక్కడ పోలీసులు తాము భద్రపరిచిన దుస్తులు చూపించడంతో అవి మనోజ్‌కు చెందినవేనని అతని అన్న నిర్ధారించాడు. కానీ ఇన్ని రోజులుగా కళాశాలకు ఓ విద్యార్థి రాకపోతే ఇంటికి ఫోన్‌ చేసి చెప్పాలని యాజమాన్యానికి ఎందుకు అనిపించలేదని మనోజ్‌ సోదరుడు మల్లేశ్వరరెడ్డి ప్రశ్నిస్తున్నారు. తన తమ్ముడి మరణంపై అనుమానాలున్నాయని, రెండు రోజుల పాటు కళాశాల చుట్టూ తిరిగినా వారు సరైన సమాధానం చెప్పకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని, నిజాలు నిగ్గుతేల్చి తమకు న్యాయం చేయాలని సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎసై ్స టి.మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి, నాలుగైదు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి ఏం జరిగిందో తేలుస్తామని బాధితులకు చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement