కర్నూలులో మయన్మార్‌ బృందం | Myanmar team in Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో మయన్మార్‌ బృందం

Jan 11 2017 12:33 AM | Updated on Jun 4 2019 5:04 PM

జిల్లాలో వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మయన్మార్‌ దేశ ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది.

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పరిశీలన
కర్నూలు(అగ్రికల్చర్‌) : జిల్లాలో వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మయన్మార్‌ దేశ ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. మయన్మార్‌ నుంచి పది మంది అధికారులు కలిగిన బృందం కర్నూలు చేరుకుంది. ముందుగా కల్లూరు మండలం బొల్లవరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. అనంతరం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలోని భూసార పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీ శేషారెడ్డి భూసార పరీక్ష కేంద్రాల్లో చేపట్టే మట్టి, నీళ్ల పరీక్షల గురించి వివరించారు.  మయన్మార్‌ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు బాగా ఉన్నాయని, వీటిని మరింత అధ్యయనం చేసి మయన్మార్‌లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement