తాగిన మైకంలో ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఒకరిని బలి తీసుకుంది.
బ్రాహ్మణపల్లెలో వ్యక్తి దారుణ హత్య
Mar 30 2017 11:18 PM | Updated on Jul 30 2018 8:37 PM
ఓర్వకల్లు: తాగిన మైకంలో ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఒకరిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన బ్రహ్మణపల్లెలో గురువారం చోటు చేసుకుంది. ఉగాది సంబరాల సందర్భంగా గ్రామంలో కొందరు రైతులు కాడెద్దులతో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన బోయ పుల్లయ్య(58), పిన్నాపురం ఎల్లప్ప మద్యం తాగి చిందులు వేస్తుండగా ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఆ సమయంలో స్థానికులు ఇద్దరిని మందలించి అక్కడి నుంచి పంపివేశారు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన ఎల్లప్ప కర్రతో పుల్లయ్య తలమీద బాదాడు దీంతో తీవ్ర రక్తస్రావమైన పుల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆటోలో కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు ఎల్లప్పపై హత్య కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. సీఐ నాగరాజు యాదవ్ ఆదేశాల మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలుకు తరలించారు. హతునికి భార్యతో పాటు శ్రీనివాసులు, వెంకటరమణ అను ఇద్దరు కుమారులు సంతానం.
Advertisement
Advertisement