ప్రతీకారంతోనే మట్టుబెట్టారు | murder for revange | Sakshi
Sakshi News home page

ప్రతీకారంతోనే మట్టుబెట్టారు

Aug 1 2016 10:36 AM | Updated on Jul 30 2018 8:29 PM

ప్రతీకారంతోనే మట్టుబెట్టారు - Sakshi

ప్రతీకారంతోనే మట్టుబెట్టారు

స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద ఈ నెల 26న జరిగిన జంట హత్యల కేసు మిష్టరీని పోలీసులు ఛేదించారు.

వీడిన జంట హత్యల కేసు మిష్టరీ
పోలీసుల అదుపులో నిందితులు 
పాణ్యం: 
స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద ఈ నెల 26న జరిగిన జంట హత్యల కేసు మిష్టరీని పోలీసులు ఛేదించారు.  కేసులో నిందితులుగా ఉన్న కొలిమిగుండ్ల మండలం బి. ఉప్పులూరుకు చెందిన ఎనిమిది మందిని ఆదివారం అరెస్టు చేశారు. తమ వర్గానికి చెందిన వ్యక్తిని గత ఏడాది హత్య చేసినందుకే వారిని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు విచారణలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ వినోద్‌కుమార్, నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. కొలిమిగుండ్ల మండలం బి. ఉప్పలూరుకు చెందిన ధార లక్ష్మయ్య, ధార ఓబులేసు హత్యకు గురైన విషయం తెలిసిందే.

ఆదే గ్రామానికి చెందిన కంభం  రామసుబ్బయ్య, కుమ్మరి నాగరాజు, కుమ్మరి రవి, కుమ్మరి శివయ్య, పొట్టిపాటి పెద్దరాజు, నార్ల చంద్ర, పొట్టిరాజు గంగరాజు, కంభం మోహన్‌ను నిందితులుగా గుర్తించారు. హతులు ఓబులేసు, లక్ష్మయ్య గత ఎడాది అదే గ్రామానికి చెందిన రామకష్ణయ్యను సెప్టెంబర్‌లో హత్య చేశారు. ప్రతీకారం పెంచుకున్న ప్రత్యర్థులు వారిని మట్టు పెట్టేందకు పన్నాగం పన్నారు.  డిసెంబర్‌లో రూ. 2లక్షలు వసూలు చేసి స్కార్పియో కారు(ఏపీ 31ఎయూ6644)ను కొన్నారు.

రామకష్ణయ్య హత్య కేసుకు సంబంధించి గత నెల 26న బనగాన పల్లె కోర్టుకు హాజరైన ఓబులేసు, లక్ష్మయ్య సాయంత్రం గ్రామానికి వెళ్లేందుకు పాణ్యం రైల్వే స్టేషన్‌ వద్ద ఉండగా వేటకొడవళ్లతో దాడి హతమార్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో పాణ్యం సీఐ పార్థసారథి రెడ్డి, ఎస్‌ఐలు మురళీమోహన్‌రావు, శ్రీనివాసులు, క్రైమ్‌ సిబ్బంది బాబు, ఆనంద్‌రావు, రాముడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement