వేతనాల కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన | municipal workers hold dhrna for salaries | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

Sep 15 2016 12:30 AM | Updated on Oct 16 2018 6:27 PM

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు - Sakshi

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు

బకాయిపడిన మూడు నెలల వేతనాలు చెల్లించాలని మున్సిపల్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. వేతనాలు అందక కుటుంబాలు గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పలమనేరు :బకాయిపడిన మూడు నెలల వేతనాలు చెల్లించాలని మున్సిపల్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. వేతనాలు అందక కుటుంబాలు గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై మున్సిపల్‌ కార్మికులు బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వీరికి సీపీఐ నాయకుడు చెన్నకేశవులు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, కార్మికులకు మూడు నెలలుగా వేతనం లేకుంటే ఎలా జీవిస్తారని ప్రశ్నించారు.  ప్రభుత్వ ఉద్యోగులే ఒకటో తేదీ జీతం రాకుంటే, ఇబ్బందులు పడే ఈ రోజుల్లో కార్మికుల బతుకులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలన్నారు.  అనంతరం కమిషనర్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో కార్మికసంఘ నాయకులు శ్రీనివాసులు, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement