అన్ని కులాల్లో చైతన్యం తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అ«ధ్యక్షుడు మేకల వెంకటేష్‌గౌడ్ పేర్కొన్నారు.
చిలమత్తూరు : అన్ని కులాల్లో చైతన్యం తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అ«ధ్యక్షుడు మేకల వెంకటేష్‌గౌడ్ పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం వారు కొడికండ చెక్‌పోస్టులోని టూరిజం హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. అన్ని కుల సంఘాల చైతన్యం కోసం ఈ నెల 18న జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు.
ఎస్సీల వర్గీకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. ఏప్రిల్ 5న వర్గీకరణ సాధన కోసం మాదిగల సంకల్ప యాత్రను తిరుపతిలో ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం మే 8న లక్షలాది మంది మాదిగల ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామని వివరించారు. లేపాక్షి హబ్ భూములపై ప్రశ్నించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్యనారు. భూములపై ఉద్యమాలు చేసింది ఎమ్మార్పీఎస్ మాత్రమే అన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ యువసేన జిల్లా అ«ధ్యక్షుడు జింక సజ్జప్ప, నాయకులు శ్రీకాంత్‌గౌడ్, కదిరెప్ప, మురళీ, గోవిందు, నంజుండ, నరసింహులు, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.