పేకాడుతూ పట్టుబడ్డ ఎంపీపీ, కానిస్టేబుల్ | mpp and constable caught while playing cards | Sakshi
Sakshi News home page

పేకాడుతూ పట్టుబడ్డ ఎంపీపీ, కానిస్టేబుల్

Sep 6 2015 7:14 PM | Updated on Mar 19 2019 5:52 PM

పేకాడుతూ పట్టుబడ్డ ఎంపీపీ, కానిస్టేబుల్ - Sakshi

పేకాడుతూ పట్టుబడ్డ ఎంపీపీ, కానిస్టేబుల్

బాధ్యతాయుతంగా ఉండాల్సిన మండలాధ్యక్షుడు ఓ కానిస్టేబుల్తో కలిసి పేకాట ఆడుతూ అడ్డంగా పట్టుబడ్డాడు.

కామేపల్లి: బాధ్యతాయుతంగా ఉండాల్సిన మండలాధ్యక్షుడు ఓ కానిస్టేబుల్తో కలిసి పేకాట ఆడుతూ అడ్డంగా పట్టుబడ్డాడు. కామేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామంలో పేకాట ఆడుతున్నట్టు ఆదివారం పోలీసులకు సమాచారం అందింది.  దీంతో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న కామేపల్లి ఎంపీపీ మాలోతు సరిరాం నాయక్, స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ భరద్వాజ శివకుమార్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement