కేంద్రమంత్రులను కలసిన ఎంపీ బుట్టా
కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక మంగళవారం పార్లమెంట్ ఆవరణలో కేంద్రమంత్రులు అబ్బాస్ నక్వీ, రాజ్‌నాథ్‌సింగ్‌లను కలసి నియోజకవర్గ సమస్యలను విన్నవించారు.
– సీపీఎస్‌ను రద్దుచేయాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నపం
– ఉర్దూ, అరబిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని అబ్బాస్ నక్వీకి వినతి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక మంగళవారం పార్లమెంట్ ఆవరణలో కేంద్రమంత్రులు అబ్బాస్ నక్వీ, రాజ్‌నాథ్‌సింగ్‌లను కలసి నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. మొదట కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని కలసి మైనార్టీ విద్యార్థుల కోసం ఉర్దూ, అరబిక్ పాఠశాలలు, అలాగే ఆదోనిలో బాలికల గురుకుల పాఠశాల, సద్భావన మంటపాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. జిల్లాకు ఎంఎస్‌డీపీ కింద పాలిటెక్నిక్, జూనియర్, ఐటీఐ కాలేజీలను మంజూరు చేసినందుకు ఆమె మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు, ఆదోని ప్రాంతాల్లో పర్యటించాలని మంత్రి అబ్బాస్‌నక్వీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆమె వెల్లడించారు. తర్వాత కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి నూతన పెన్షన్ విధానంతో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. అలాగే ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను త్వరగా ఆమోదింపజేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.