అమ్మా.. నేను క్షేమం! | Mother Iam safe in govt hospital stuff help | Sakshi
Sakshi News home page

అమ్మా.. నేను క్షేమం!

Jun 27 2016 3:36 AM | Updated on Sep 4 2017 3:28 AM

అమ్మా.. నేను క్షేమం!

అమ్మా.. నేను క్షేమం!

నవజాత శిశువు ఆదివారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల వార్డులో...

కర్నూలు(హాస్పిటల్): నవజాత శిశువు ఆదివారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల వార్డులో కనిపించింది. మధ్యాహ్నం వేళ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వార్డులోని పీఐసీయు వద్ద నేలపై శిశువును పడుకోబెట్టి వెళ్లిపోయారు. పది రోజులు వయస్సుండే ఈ ఆడశిశువు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నట్లు బక్కచిక్కి కనిపిస్తోంది.

తల్లి కోసమే, అనారోగ్యం బాధ తట్టుకోలేకో తెలియదు కానీ గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. ఆసుపత్రి సిబ్బంది ఆ చిన్నారిని వార్డులో చేర్చుకుని చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ రవికుమార్ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మూడో పట్టణ  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement