నా 100వ సినిమాలో మోక్షజ్ఞ: బాలకృష్ణ | Mokshagna Debut In Balakrishna 100th Movie | Sakshi
Sakshi News home page

నా 100వ సినిమాలో మోక్షజ్ఞ: బాలకృష్ణ

Jan 15 2016 11:59 AM | Updated on Aug 29 2018 1:59 PM

నా 100వ సినిమాలో మోక్షజ్ఞ: బాలకృష్ణ - Sakshi

నా 100వ సినిమాలో మోక్షజ్ఞ: బాలకృష్ణ

కొత్త శకానికి సంక్రాంతి పండుగ నాంది పలకాలని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

తిరుపతి: కొత్త శకానికి సంక్రాంతి పండుగ నాంది పలకాలని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ సారి ఆయన సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.  ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని,దేవుడు చల్లని చూపు చూడాలని, పంటలు బాగా పండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ కేబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నారు. అయితే అవకాశం వస్తే సమర్థవంతంగా పని చేస్తానని బాలయ్య తన మనసులోని మాటను బయటపెట్టారు. హిందుపురం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాలకృష్ణ అన్నారు.

ఇక తన వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై బాలకృష్ణ పలు విషయాలు వెల్లడించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ 'చివరికి సినిమాల్లోకే రావాలి కదా...నా వందో సినిమాలో మా అబ్బాయి నటించవచ్చు' అని తెలిపారు. డిక్టేటర్ సినిమాపై బాలకృష్ణ మాట్లాడుతూ...అభిమానులకు ఆ సినిమా ఫుల్ ప్లేట్ మీల్స్గా ఉందని, అన్ని అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు బాలయ్య ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement