కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు | Moderate rainfall in coastal andhra pradesh | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు

Aug 13 2015 10:36 AM | Updated on Oct 16 2018 4:56 PM

ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది.

విశాఖపట్నం : ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అయితే ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ వైపు మళ్లిందని తెలిపింది.

ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలలో రుతుపవన ద్రోణి కొనసాగుతుందని వివరించింది. మరో 24 గంటలపాటు ఉత్తరాంధ్రలో వర్షాలు... కోస్తాంధ్రలో మోస్తర్ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement