ఫోన్‌ మాట్లాడుతుండగా పిడుగు పడి.. | Mobile phone explodes claims 16 years boy life in Nalgonda District | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడుతుండగా పిడుగు పడి..

May 7 2017 11:35 AM | Updated on Aug 29 2018 4:18 PM

ఫోన్‌ మాట్లాడుతుండగా పిడుగు పడి.. - Sakshi

ఫోన్‌ మాట్లాడుతుండగా పిడుగు పడి..

సెల్‌ఫోన్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే ప్రమాదం కూడా పొంచివుందనే సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.

శాలిగౌరారం(నల్లగొండ): సెల్‌ఫోన్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే ప్రమాదం కూడా పొంచివుందనే సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో సెల్‌ఫోన్‌ పేలి ఓ విద్యార్థి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన యాషబోయిన మల్లేశ్‌(16) ఇటీవలే పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం గ్రామ శివారులోని నిమ్మతోటకు నీళ్లు కట్టేందుకు తన చెల్లెలుతో కలిసి వెళ్లాడు. వాతావరంణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తుండటంతో.. ఇంటి వద్ద ఉన్న తండ్రి కొడుకుకు ఫోన్‌ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పాడు.

ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో తోట సమీపంలో పిడుగు పడటంతో.. మల్లేశ్‌ మాట్లాడుతున్న ఫోన్‌ పేలింది. దీంతో మల్లేశ్‌ అక్కడికక్కడే మృతిచెందగా అతని చెల్లెలు శిరీష(15)తో పాటు మధు(15) అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు అచేతనంగా పడి ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించి కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement