
ప్రేమ పెళ్లి.. చావుకొచ్చింది!
తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకోగా అమ్మాయిని పంపించాలని, లేకుంటే చంపేస్తామని ఓ ఎమ్మెల్యే కుమారుడు బెదిరిస్తున్నాడని వరుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
రంగారెడ్డి : తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకోగా అమ్మాయిని పంపించాలని, లేకుంటే చంపేస్తామని ఓ ఎమ్మెల్యే కుమారుడు బెదిరిస్తున్నాడని వరుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాలు.. కొత్తూరు ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్‌ఓగా పనిచేస్తున్న శ్వేత యాదవ్(24), అదే కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగి అయిన కొత్తూరు మండలం రంగాపూర్‌కు చెందిన మురళిగౌడ్(26)లు గత నెల 29న ప్రేమ వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కావాలని ఆ జంట షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది.
కాగా, అమ్మాయిని పంపించకుంటే మీ కుటుంబీకులందరినీ టిప్పర్‌తో ఢీకొట్టి చంపుతామని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు రవియాదవ్, అతని అనుచరులు బెదిరిస్తున్నారని, వారినుంచి తమకు ప్రాణ భయం ఉందని వరుడి తల్లిదండ్రులు అనిత, శ్రీనివాస్ గౌడ్‌లు కొత్తూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో శంషాబాద్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు.