breaking news
anjayya yadav
-
నాటికీ, నేటికీ ఆస్తిలో తేడా లేదట!
సాక్షి, షాద్‌నగర్: మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ 2014, 2018లో నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించిన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడించిన ఆస్తి వివరాలను చూస్తే నగదు రూ. 50వేలు, ఎస్బీఐ సెక్రటేరియట్ బ్యాంకులో రూ. 59,300, ఏపీజీవిబీ వెల్జర్ల శాఖలో రూ. 1,14,275, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 28,798 రూపాయలు ఉన్నట్టు చూపారు. 2017 మోడల్ ఫార్చునర్ వాహనం ఉన్నట్టు, దాని విలువ 33,07,675 రూపాయలు ఉన్నట్టు తెలిపారు. బంగారం విషయానికి వస్తే ఆయన దగ్గర తులం బంగారు ఆభరణాలు, దీని విలువ 30 వేలు, భార్య పేరిట 30 తులాల బంగారం, కేజీ వెండి ఉందని, వీటి విలువ రూ.9లక్షల 50వేలుగా చూపారు. స్థిరాస్తులు చూస్తే.. ఏక్లాస్పేటలో 13.22 గుంటల పొలం ఉందని, దీని మార్కెట్ విలువ రూ.35 లక్షలుగా పేర్కొన్నారు. కెనరా బ్యాంకు కేశంపేట బ్రాంచిలో రూ. 7,46,015 రుణం ఉన్నట్టు తెలిపారు. 2014 సంవత్సరంలో నగదు రూ. 2లక్షలు, ఏపీజీవీబీ వెల్జర్ల శాఖలో రూ.8,190, ఎస్బీఐ షాద్‌నగర్ శాఖలో రూ. 647, కెనరా బ్యాంకు కేశంపేట శాఖలో రూ. 3,570.70 ఉన్నట్టు చూపారు. గతంలో, ప్రస్తుతం దాఖలు చేసిన ఆస్తి వివరాల్లో పెద్దగా తేడాలు ఏమిలేవు. ఫార్చునర్ వాహనం కొనుగోలు చేయడంతో రూ.33 లక్షలు అధికంగా ఆస్తి ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
డోలు కొడతా.. ఓట్లు రాబడతా
షాద్‌నగర్ రూరల్: మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదివారం షాద్‌నగర్ మండలం నాగులపల్లి, రాసుమల్లెగూడలో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పథకాలతోపాటు మేనిఫెస్టో వివరించారు. ఈ సందర్భంగా ఆయన డోలు వాయిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. -
ప్రేమ పెళ్లి.. చావుకొచ్చింది!
రంగారెడ్డి : తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకోగా అమ్మాయిని పంపించాలని, లేకుంటే చంపేస్తామని ఓ ఎమ్మెల్యే కుమారుడు బెదిరిస్తున్నాడని వరుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. కొత్తూరు ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్ఓగా పనిచేస్తున్న శ్వేత యాదవ్(24), అదే కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగి అయిన కొత్తూరు మండలం రంగాపూర్‌కు చెందిన మురళిగౌడ్(26)లు గత నెల 29న ప్రేమ వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కావాలని ఆ జంట షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. కాగా, అమ్మాయిని పంపించకుంటే మీ కుటుంబీకులందరినీ టిప్పర్‌తో ఢీకొట్టి చంపుతామని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు రవియాదవ్, అతని అనుచరులు బెదిరిస్తున్నారని, వారినుంచి తమకు ప్రాణ భయం ఉందని వరుడి తల్లిదండ్రులు అనిత, శ్రీనివాస్ గౌడ్లు కొత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో శంషాబాద్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు.