‘చెరుకు’కు తప్పిన ముప్పు | missed threat to cheruku sudhakar | Sakshi
Sakshi News home page

‘చెరుకు’కు తప్పిన ముప్పు

Jul 25 2016 11:42 PM | Updated on Apr 3 2019 7:53 PM

‘చెరుకు’కు తప్పిన ముప్పు - Sakshi

‘చెరుకు’కు తప్పిన ముప్పు

నకిరేకల్‌ : తెలంగాణ ఉద్యమవేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.

నకిరేకల్‌ :
తెలంగాణ ఉద్యమవేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో సామాజిక  తెలంగాణ గుండెచప్పుడు కార్యక్రమానికి ఆదివారం తన ఇన్నోవా వాహనంలో అక్కడి వెళ్లారు. రాత్రి 8:30 గంటలకు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఆదిలాబాద్‌ జిల్లా మెండివారి గుట్ట సమీపంలో ఎదురుగా అడవి జంతువులు ఒక్కసారిగా వాహనానికి ఎదురుగా వచ్చాయి. దీంతో డ్రైవర్‌ వాటిని ప్రమాదాన్ని తప్పించేందుకు సడన్‌ బ్రెక్‌ వేయడంతో వాహనం ముందుభాగం ధ్వంసమైంది. సమయానికి సీటు బెల్ట్‌ పెట్టుకున్నందున చెరుకు సుధాకర్‌తో పాటు అందులో ఉన్న మరో ఆరుగురు ఉద్యమ వేదిక నాయకులు ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement