యువతిపై సామూహిక అత్యాచారం | Minor tribal gangraped in medak district | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారం

Aug 10 2016 4:47 PM | Updated on Sep 4 2017 8:43 AM

యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మెదక్: యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా చిన్నకోడూరుకు చెందిన యువతి(20)పై గత నాలుగు నెలలుగా అదే ప్రాంతానికి చెందిన 5గురు యువకులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. విషయం ఎవరికైనా చెప్తే.. కుటుంబ సభ్యులందర్ని చంపుతామని బెదిరించి యువతిపై పలుమార్లు అత్యాచారం చేశారు.

ఈ క్రమంలో యువతి గర్భవతి కావడంతో విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement