ఆగిన మైనర్ పెళ్ళి.. | Minor girl marriage has stopped in warangal district | Sakshi
Sakshi News home page

ఆగిన మైనర్ పెళ్ళి..

May 5 2016 10:45 PM | Updated on Sep 3 2017 11:28 PM

వరంగల్ నగరంలోని అండర్ రైల్వేగేట్ శంభునిపేట ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఓ బాలిక పెళ్లి ఆగిపోయింది.

కరీమాబాద్: వరంగల్ నగరంలోని అండర్ రైల్వేగేట్ శంభునిపేట ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఓ బాలిక పెళ్లి ఆగిపోయింది. మిల్స్‌కాలనీ ఎసై్స రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సాకరాసికుంటకు చెందిన వరుడు ఎండీ సలీం(26), రంగశాయిపేట-ఉర్సురోడ్‌కు చెందిన వధువు అబేదా(15)కు శంభునిపేట ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు పెళ్లి ఏర్పాట్లు చేశారు.

అయితే వధువు మైనర్ అని తెలిసి 100కు డయల్ చేయడంతో మిల్స్‌కాలనీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎస్‌ఐ రవీందర్‌తో పాటు సిబ్బంది ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. అక్కడ వివాహ ఏర్పాట్లు జరుగుతుండంతో చైల్డ్‌లైన్ వారికి సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధులు వచ్చి వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement