ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పాలేరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
నేలకొండపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పాలేరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం- జక్కిపల్లి గ్రామాల మధ్య సాగర్ ఎడమ కాలువ పై రూ. 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జీని మంత్రి తుమ్మల ప్రారంభించారు.
అనంతరం మోటపల్లిలో 3500 ఎకరాలు సాగుబడి అయ్యే అయితు ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్‌బాబు ఉన్నారు.