మరికల్‌ను నవాబుపేటలో కలపండి | Merge Marikal In Nawabpet | Sakshi
Sakshi News home page

మరికల్‌ను నవాబుపేటలో కలపండి

Aug 21 2016 7:26 PM | Updated on Sep 4 2017 10:16 AM

ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

నవాబుపేట : మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా మరికల్‌ గ్రామాన్ని నవాబుపేటలో కలిపి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోకి తీసుకు రావాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

నవాబుపేట : మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా మరికల్‌ గ్రామాన్ని నవాబుపేటలో కలిపి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోకి తీసుకు రావాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. జిల్లా సరిహద్లులో ఆదివారం వారు ధర్నా చేపట్టారు. మరికల్‌ గ్రామం నవాబుపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రంగారెడ్డి జిల్లా సరిహద్దు కేవలం కిలోమీటరున్నర దూరంలో ఉంది. మరికల్‌ గ్రామస్తులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దాదాపు వంద కిలోమీటర్లు వెళాల్సి వస్తుందని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం 22కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపారు. గ్రామస్తులందరికీ సౌకర్యంగా ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోకి తెచ్చి నవాబుపేట మండలంలో కలపాలని  వారు డిమాండ్‌ చేశారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement