వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడియం మండలం మురమండలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మురమండ గ్రామానికి చెందిన బంటు శ్రీనివాసరావు (27) మహబూబాబాద్‌లో స్వీట్‌స్టాల్
నవవరుడి ఆత్మహత్య!
Feb 4 2017 11:51 PM | Updated on Nov 6 2018 7:53 PM
కడియం :
వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడియం మండలం మురమండలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మురమండ గ్రామానికి చెందిన బంటు శ్రీనివాసరావు (27) మహబూబాబాద్‌లో స్వీట్‌స్టాల్ నిర్వహిస్తున్నాడు. అతడికి ఈనెల 2వ తేదీన వివాహం జరిగింది. 3వ తేదీన నూతన వధూవరులు అన్నవరం కూడా వెళ్లి వచ్చారు. అయితే తెల్లవారుజామున మురమండలో సదరు యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి ఆత్మహత్యకు కారణాలేంటన్నది తెలియడం లేదని పోలీసులు చెప్పారు. ఇరువైపుల వారు ఎందుకు మృతి చెందాడన్నదానిపై సమాధానం చెప్పలేకపోతున్నారని వారు చెబుతున్నారు. శ్రీనివాసరావు తండ్రి బంటు చిన్నబ్బాయి ఫిర్యాదు మేరకు కడియం ఎస్‌ఐ ఎల్. గౌరీనాయుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
Advertisement


