వైద్యం వికటించి చిన్నారి మృతి | medical treatment reaction | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి చిన్నారి మృతి

Aug 14 2016 11:49 PM | Updated on Sep 4 2017 9:17 AM

వైద్యం వికటించి చిన్నారి మృతి

వైద్యం వికటించి చిన్నారి మృతి

వైద్యం వికటించి చిన్నారి మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని అంకమ్మగుడి వీధిలో ఓ పిల్లల వైద్యశాల వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం కాసరబాదకి చెందిన ఊటుకూరి రమేష్, దివ్య దంపతులకు చెందిన నాలుగు నెలల బాబుకు జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.

 
నందిగామ రూరల్‌ :
 వైద్యం వికటించి చిన్నారి మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని అంకమ్మగుడి వీధిలో ఓ పిల్లల వైద్యశాల వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం కాసరబాదకి చెందిన ఊటుకూరి రమేష్, దివ్య దంపతులకు చెందిన నాలుగు నెలల బాబుకు జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం బాలుడి పరిస్థితి కొంతమేర మెరుగ్గా ఉంది. ఆ సమయంలో వైద్యుడు ఇచ్చిన ఓ ఇంజక్షన్‌ కారణంగా చిన్నారి ఒంటిపై పలు ప్రదేశాల్లో మచ్చలు వచ్చాయి. కొద్ది సేపటికే ఊపిరి నిలిచిపోయింది. ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తులసి రామకృష్ణ ఆస్పత్రి వర్గాలు, బాలుడి బంధువులతో చర్చించి ఆందోళన విరమింపచేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement