చర్లలో మావో పోస్టర్ల కలకలం | maoist posters tension at charla | Sakshi
Sakshi News home page

చర్లలో మావో పోస్టర్ల కలకలం

Sep 6 2015 2:33 PM | Updated on Oct 9 2018 2:47 PM

మరోసారి మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ప్రధాన రహదారిపై ఆదివారం మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి.

చర్ల(ఖమ్మం): మరోసారి మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ప్రధాన రహదారిపై ఆదివారం మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు వెంకటాపురం కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్లను అంటించారు. భద్రాచలం ఆలయ భూములను పేదలకు పంచాలని మావోయిస్టులు పోస్టర్‌లో పేర్కొన్నారు. అలాగే పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టుల నిర్మాణం ఆపివేయాలన్నారు. అపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రజాయుద్దం ద్వారా తిప్పి కొడతామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement