తెలుగు భాషాభిమాని మండలి | Mandali Krishna Rao jayanthi | Sakshi
Sakshi News home page

తెలుగు భాషాభిమాని మండలి

Aug 4 2016 11:54 PM | Updated on Sep 4 2017 7:50 AM

తెలుగు భాషాభిమాని మండలి

తెలుగు భాషాభిమాని మండలి

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో పాటు తెలుగు భాషాభివృద్ధికి పాటుపడిన దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు ఎనలేనివని మలేషియా తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు దాతుక్‌ అచ్చయ్యకుమార్‌ కొనియాడారు.

అవనిగడ్డః  ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో పాటు తెలుగు భాషాభివృద్ధికి పాటుపడిన దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు ఎనలేనివని మలేషియా తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు దాతుక్‌ అచ్చయ్యకుమార్‌ కొనియాడారు. అవనిగడ్డలో గురువారం నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు 90వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅథిగా హాజరయ్యారు.  తొలుత మలేషియా బృందానికి పులిగడ్డలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఘనస్వాగతం పలికారు.  ఈ కార్యక్రమంలో మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం కులపతి మునిరత్నం నాయుడు, అసోసియేషన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ గణేష్, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.



 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement