అవనిగడ్డలో ఉద్రిక్తత.. ప్రొటోకాల్‌ రగడ | Protocol Controversy At Avanigadda Anna Canteen Inauguration Ceremony | Sakshi
Sakshi News home page

అవనిగడ్డలో ఉద్రిక్తత.. ప్రొటోకాల్‌ రగడ

Apr 15 2026 2:32 PM | Updated on Apr 15 2026 3:08 PM

Protocol Controversy At Avanigadda Anna Canteen Inauguration Ceremony

సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ కూట‌మిలో విభేదాలు భ‌గ్గుమన్నాయి. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ జరిగింది. అవ‌నిగ‌డ్డ అన్న క్యాంటీన్ ఓపెనింగ్ ఉద్రిక్త‌త‌కు దారితీసింది. శిలాఫ‌ల‌కంపై ఏఎంసీ ఛైర్మ‌న్ కొల్లూరి వెంక‌టేశ్వ‌ర‌రావు పేరు లేక‌పోవ‌డంతో రచ్చ మొదలైంది. ఏఎంసీ ఛైర్మ‌న్ పేరు లేని శిలాఫ‌ల‌కం మాకొద్దంటూ శిలాఫ‌ల‌కం బోర్డును  వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ర్గీయులు పీకేశారు.

శిలాఫ‌ల‌కాన్ని స‌మీపంలోని పంట‌కాలువలో ప‌డేసేందుకు య‌త్నించారు. వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ర్గాన్ని అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడు క‌న‌ప‌ర్తి శ్రీనివాస్ అడ్డుకున్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డితే కుల వివ‌క్ష చూపుతున్నారంటూ వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ర్గం మండిపడ్డారు. శిలాఫ‌ల‌కం వ‌ద్ద భైఠాయించి వెంకటేశ్వ‌ర‌రావు వ‌ర్గీయులు నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్ సిబ్బందితో గొడ‌వ‌కు దిగారు. కార్యక్రమం రచ్చ రచ్చగా మారడంతో  అవ‌నిగ‌డ్డ అన్న క్యాంటీన్ ప్రారంభానికి నోచుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement