చెల్లెలి కోసం వచ్చిన స్నేహితురాలిపై.. | Man Sexually Harassing on girl | Sakshi
Sakshi News home page

చెల్లెలి కోసం వచ్చిన స్నేహితురాలిపై..

Jun 4 2016 7:57 PM | Updated on Jul 23 2018 9:13 PM

చెల్లెలి కోసం వచ్చిన స్నేహితురాలిపై.. - Sakshi

చెల్లెలి కోసం వచ్చిన స్నేహితురాలిపై..

చెల్లెలి కోసం ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలిపై ఓ యువకుడు లైంగిక దాడి చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.

ఆలమూరు: చెల్లెలి కోసం ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలిపై ఓ యువకుడు లైంగిక దాడి చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. అంతేకాకుండా ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఇంటర్నెట్ లో వీడియో అప్‌లోడ్ చేస్తానని.. కుటుంబ సభ్యులను చంపేస్తానిని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడలో  శనివారం వెలుగు చూసింది. వివరాలు.. స్థానిక ఎస్సీ పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక గత నెల 9న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె సోదరుడు తాడేపల్లి వరప్రసాద్(19)ను ‘మీ చెల్లెలు ఎక్కడుంది’ అని అడిగింది. గదిలో ఉందని చెప్పడంతో బాలిక గదిలోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టి కత్తితో బెదిరించి ఆమె పై లైంగిక దాడి చేశాడు.

ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించానని, విషయం బయటకు చెప్తే సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించాడు. అంతేకాక బాలిక కుటుంబ సభ్యులను సైతం చంపుతానని హెచ్చరించాడు. దాంతో ఆ బాలిక జరిగిన ఘాతుకం గురించి ఎవరికీ చెప్పలేదు. కాగా శుక్రవారం వరప్రసాద్ స్నేహితుల మొబైల్ ఫోన్లలో లైంగికదాడికి సంబంధించిన దృశ్యాలు స్థానికుల కంటబడ్డాయి. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కుమార్తెను నిలదీయగా.. జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వరప్రసాద్ పరారీలో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement