వేములవాడ యువకుడి దారుణ హత్య | man murdered in vemulawada | Sakshi
Sakshi News home page

వేములవాడ యువకుడి దారుణ హత్య

Aug 19 2016 8:16 AM | Updated on Aug 29 2018 8:36 PM

వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన నలువల ఉమేష్ దారుణ హత్యకు గురయ్యాడు.

కరీంనగర్ : వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన నలువల ఉమేష్ (24) అనే యువకుడు గురువారం అర్థరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఆగంతకులు ఉమేష్‌ను కత్తులతో పొడిచి దారుణంగా చంపి... పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement