బాలికపై లైంగిక దాడి | Man Molestates girl, arrested | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

May 14 2016 8:35 PM | Updated on Oct 9 2018 5:39 PM

ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిలో తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

చేబ్రోలు: ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిలో తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ సుభాని తెనాలిలోని జ్యూయలరీ షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న వారి ఏడేళ్ల బాలిక వద్దకు వెళ్లి షాంపు తీసుకురమ్మని చెప్పాడు. షాంపు తెచ్చిన తర్వాత  బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేకలు విన్న బాలిక అన్న అక్కడకు చేరుకునే సమయానికి నిందితుడు పరారయ్యాడు.

రక్తస్రావం అయిన బాలికను తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లి, అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు, సీఐ జి.రవికుమార్, ఎస్‌ఐ కె.ఆరోగ్యరాజు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement