ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో పేలిన బాంబు | man injured in freak accident | Sakshi
Sakshi News home page

ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో పేలిన బాంబు

Nov 2 2015 5:43 PM | Updated on Sep 3 2017 11:54 AM

ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో పేలిన బాంబు

ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో పేలిన బాంబు

సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో బాంబు పేలి చెయ్యి తెగి పడిన ఘటన సోమవారం బయ్యారం మండలంలోని పెద్దచెరువు వద్ద చోటుచేసుకుంది.

బయ్యారం (ఖమ్మం జిల్లా) : సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో నాటు బాంబు పేలి చెయ్యి తెగి పడిపోయింది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని పెద్దచెరువు వద్ద చోటుచేసుకుంది. బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన శివ (32) చేపలు పడదామని సోమవారం నాటుబాంబుతో బయ్యారం పెద్ద చెరువు వద్దకు వెళ్లాడు.

నాటుబాంబును చెరువులో విసిరి చేపలు పడదామని అనుకుని బాంబుకు నిప్పంటించాడు. అదే సమయంలో ఫోన్ మోగడంతో బాంబు విషయం మర్చిపోయి, ఫోన్‌ మాట్లాడుతున్నాడు. బాంబు ఒక్కసారిగా పేలడంతో చెయ్యి తెగిపడింది. క్షతగాత్రుడిని మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement