అనంతపురంజిల్లా విడపనకల్లు మండలం పరిధిలోని ఉండబండ గ్రామానికి చెందిన కూలీ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు.
కట్టెల కోసం వెళ్లి శవమయ్యాడు...
Dec 16 2016 5:09 PM | Updated on Sep 5 2018 2:26 PM
	ఉరవకొండ: అనంతపురంజిల్లా విడపనకల్లు మండలం పరిధిలోని ఉండబండ గ్రామానికి చెందిన కూలీ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం రంగస్వామి అనే కూలీ కట్టెలు కొట్టుకురావడానికి వెళ్లాడు. రాత్రి అయినా భర్త రాకపోవడంతో ఆమె బంధువులతో కలిసి గాలించింది. రెండు రోజుల పాటు వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు శుక్రవారం ఉదయం కొందరు గ్రామస్తులకు గ్రామం సమీపంలోని పొలం వద్ద ముళ్లపొదల్లో శవమై కనిపించాడు.
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రంగస్వామి కట్టెలు కొట్టేందుకు చెట్టుపైకి ఎక్కాడని, చెట్టుపై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలను గమనించక పోవడంతో అవి తగిలి విద్యుదాఘాతానికి గురై చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
