గనిలో ‘మా ఊరు ప్రేమ కథ ’ | Sakshi
Sakshi News home page

గనిలో ‘మా ఊరు ప్రేమ కథ ’

Published Thu, Nov 3 2016 11:26 PM

గనిలో ‘మా ఊరు ప్రేమ కథ ’ - Sakshi

బనగానపల్లె రూరల్‌: గోవిందిన్నె సమీపంలోని పలుకూరు క్రాస్‌ రోడ్డులోని ఓ నాపరాతి గనిలో మా ఊరి ప్రేమ కథ చిత్రం షూటింగ్‌ సన్నీవేశాలను చిత్రీకరించారు. హీరో మంజునాథ్, హీరోయిన్‌ తనీష్‌ తివారి, విలన్‌ రుద్రప్రకాష్‌తో పాటు మరి కొందరి ఆర్టిస్టులతో ఫైట్స్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, హీరో మంజునాథ్‌ మాట్లాడుతూ ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మొదట గనిలో చిత్రానికి షూటింగ్‌కు అనుమతి లేదని నందివర్గం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంజునాథ్‌ పోలీసు అధికారులతో చర్చించిన తరువాత ఆరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.   
 

Advertisement
 
Advertisement