లారీల సమ్మె ఇక మరింత ఉధృతం | lorrys strike heavy | Sakshi
Sakshi News home page

లారీల సమ్మె ఇక మరింత ఉధృతం

Apr 4 2017 11:17 PM | Updated on Sep 5 2017 7:56 AM

లారీ యజమానుల డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మెను ఉధృతంగా చేస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు. మండలంలో గుమ్మళ్లదొడ్డి శివారులో ఉన్న ఐఓసీఎల్‌ ప్లాంట్‌ ఎదురుగా డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌

  • లారీ ఓనర్స్‌ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి 
  • గోకవరం (జగ్గంపేట) : 
    లారీ యజమానుల డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మెను ఉధృతంగా చేస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు. మండలంలో గుమ్మళ్లదొడ్డి శివారులో ఉన్న ఐఓసీఎల్‌ ప్లాంట్‌ ఎదురుగా డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జిల్లాలోని పలు లారీ, వ్యా¯ŒS యూనియ¯ŒS నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున ఈ నెల 8 నుంచి ఆలిండియా బంద్‌కు పిలుపు ఇచ్చామన్నారు. మంగళవారానికి సమ్మె ఆరో రోజుకు చేరిందని, అవసరమైతే నిత్యావసర సరుకుల లారీలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. జిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేష¯ŒS కార్యదర్శి ఎంఆర్‌ శేఖర్‌రెడ్డి, గోదావరి నేషనల్‌ అసోసియేష¯ŒS అధ్యక్షుడు సీహెచ్‌ ఆంజనేయప్రసాద్, కార్యదర్శి దుర్గాప్రసాద్, గోకవరం, పిఠాపురం, సోమేశ్వరం, కేశవరం, ఆలమూరు, పెద్దాపురం, రాజమహేంద్రవరం, రావులపాలెం, ద్వారపూడి, అనపర్తి, కత్తిపూడి, బలభద్రపురం, బిక్కవోలు, సామర్లకోట, రాజోలు, కొత్తపల్లి తదితర లారీ, వ్యా¯ŒS అసోసియేష¯ŒS నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న కోరుకొండ సీఐ మధుసూదనరావు, గోకవరం ఎస్సై వెంకటసురేష్, తిరుపతిరావు, సిబ్బందితో ఐఓసీఎల్‌ ప్లాంట్‌ బందోబస్తు నిర్వహించారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement