లారీని ఢీకొన్న బస్సు | lorry and bus collide | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న బస్సు

Oct 17 2016 2:07 AM | Updated on Apr 7 2019 3:24 PM

ఏలూరు అర్బన్‌ : లారీ, ఆర్టీసీ బస్‌ ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నలుగురు బస్సు ప్రయాణికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏలూరు అర్బన్‌ : లారీ, ఆర్టీసీ బస్‌ ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నలుగురు బస్సు ప్రయాణికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు డిపోకు చెందిన బస్సు ఆదివారం మచిలీపట్నం నుంచి ఏలూరు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు హనుమాన్‌జంక్షన్‌కు చేరుకునే సరికి ఓ మోటార్‌ సైక్లిస్ట్‌ వేగంగా ఎదురుగా దూసుకువచ్చాడు. అతన్ని తప్పించే క్రమంలో డ్రైవర్‌ బస్సును పక్కకు మరల్చడంతో అటుగా ప్రయాణిస్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో బస్‌లో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిలో ఏలూరుకు చెందిన  ఆకురాతి అనూరాధ, దివ్య, నవ్య, భారతికి బలమైన గాయాలు కావడంతో వారిని ఆర్టీసీ సిబ్బంది ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అదే సందర్భంలో లారీ, బస్సు మధ్య చిక్కుకుని తీవ్రగాయాలపాలైన మోటార్‌ సైక్లిస్ట్‌ను విజయవాడ ఆసుపత్రికి తరలించారు
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement