లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం | lorry accident one men die | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

Oct 13 2016 12:10 AM | Updated on Sep 4 2017 5:00 PM

ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో ఉన్న ఆశ్రమం సమీపంలో బుధవారం లారీ ఢీకొని వెలుర్తి ప్రభాకర్‌రావు(60) దుర్మరణం చెందాడు. మతుడి బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ఎర్రగుంట్ల:ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో ఉన్న ఆశ్రమం సమీపంలో బుధవారం లారీ ఢీకొని వెలుర్తి ప్రభాకర్‌రావు(60) దుర్మరణం చెందాడు. మతుడి బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెలుర్తి ప్రభాకర్‌రావు ఉదయాన్నే టిఫిన్‌ కోసమని సైకిల్‌లో ఇంటి వద్ద నుంచి బయలుదేరాడు. వేంపల్లి రోడ్డుపైకి రాగానే లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కిడిక్కడే మతి చెందాడు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. సంఘటన స్థలంలో మతదేహంపై పడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మతుడి భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టరు ఎంవీ సుదీర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement