ఆయిల్ కోసం ఉరుకులు పరుగులు | loaded palm oil lorry overturns | Sakshi
Sakshi News home page

ఆయిల్ కోసం ఉరుకులు పరుగులు

Jun 15 2016 3:44 AM | Updated on Sep 4 2017 2:28 AM

ఆయిల్ కోసం ఉరుకులు పరుగులు

ఆయిల్ కోసం ఉరుకులు పరుగులు

ఆయిల్ ట్యాంకర్‌కు గేదె అడ్డుగా రావడంతో ట్యాంకర్ బోల్తాపడి ఒకరు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి...

పిడుగురాళ్లరూరల్ : ఆయిల్ ట్యాంకర్‌కు గేదె అడ్డుగా రావడంతో ట్యాంకర్ బోల్తాపడి ఒకరు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కామేపల్లి గ్రామ బైపాస్ మీద గేదె అడ్డుగా రావడంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ సుభాని గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతనిని స్థానిక ప్రయివేటు వైద్యశాలకు తరలించారు.
 
బోల్తాపడిన ట్యాంకర్ నుంచి లీకవుతున్న ఆయిల్ కోసం చుట్టుపక్కల గ్రావూల నుంచి ప్రజలు బిందెలు, బకెట్లు పట్టుకుని ఆ ప్రాంతానికి పరుగులుదీశారు. బిస్కెట్ల తయూరీకి దీనిని వాడతారని, ఇళ్లల్లో వినియోగించవచ్చా లేదో తెలియదని లారీ క్లీనర్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement