మూడు పిల్లలకు జన్మనిచ్చిన సింహం | lion gives birth to three babylions in sv zoo | Sakshi
Sakshi News home page

మూడు పిల్లలకు జన్మనిచ్చిన సింహం

Dec 25 2015 11:33 PM | Updated on Sep 3 2017 2:34 PM

తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 18వ తేదీ జూపార్క్‌లోని శ్రీ అనే సింహం మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 18వ తేదీ జూపార్క్‌లోని శ్రీ అనే సింహం మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయం శుక్రవారం వరకు అధికారులు గోప్యంగా ఉంచారు. దక్షిణ భారత దేశంలోనే ఇది అరుదైన ఘటన కావడంతో జంతు ప్రేమికుల్లో అనందం నింపుతోంది. 2014లో హైదరాబాద్ నుంచి శ్రీ అనే ఆడసింహం, హరి అనే మగ సింహాన్ని ఎస్వీ జూపార్క్‌కు తరలించారు.

సీసీ కెమెరాల ద్వారా సింహం, పిల్లల కదిలికలను గమనిస్తున్నారు. రెండు వారాలకు కళ్లు తెరుస్తాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జన్మించిన పిల్లలు ఒక కిలోలోపు మాత్రమే బరువు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూపార్క్‌లో మొత్తం 32 సింహాలు ఉన్నాయి. 10 సఫారి నుంచి తెచ్చినవి కాగా, మిగతా 20 సర్కస్ కంపెనీల నుంచి తరలించారు. ఇవేకాకుండా 9 తెల్ల పులులు, 5 బెంగాల్ టైగర్స్ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement