యువభేరిని విజయవంతం చేద్దాం | letus success the yuva bheri | Sakshi
Sakshi News home page

యువభేరిని విజయవంతం చేద్దాం

Oct 23 2016 11:27 PM | Updated on Sep 4 2017 6:06 PM

యువభేరిని విజయవంతం చేద్దాం

యువభేరిని విజయవంతం చేద్దాం

కర్నూలులో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న యువభేరి కార్యక్రమాన్ని విజయవంత చేద్దామని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

-వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న యువభేరి కార్యక్రమాన్ని విజయవంత చేద్దామని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కృష్ణకాంత్‌ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు అనిల్‌కుమార్‌ అధ్యక్షతన వలంటీర్ల సమావేశం నిర్వమించారు. గౌరు వెంకటరెడ్డితో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి. రాజా విష్ణు వర్ధన్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.యువభేరిలో వలంటీర్లు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణకు మారుపేరనేది ప్రతి వలంటీర్‌ గుర్తించుకోవాలన్నారు. కేటాయించిన చోటనే విధులు నిర్వర్తిస్తూ  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి.. ప్రత్యేక ఉద్యమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారన్నారు.  యువకులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని యువభేరిని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రఘు, నాయకులు సంజు, షాలి, భానుప్రకాశ్, వినోద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement