breaking news
gouru venkatareddy
-
యువభేరిని విజయవంతం చేద్దాం
-వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న యువభేరి కార్యక్రమాన్ని విజయవంత చేద్దామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు అనిల్‌కుమార్ అధ్యక్షతన వలంటీర్ల సమావేశం నిర్వమించారు. గౌరు వెంకటరెడ్డితో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి. రాజా విష్ణు వర్ధన్రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.యువభేరిలో వలంటీర్లు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు మారుపేరనేది ప్రతి వలంటీర్ గుర్తించుకోవాలన్నారు. కేటాయించిన చోటనే విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ అధినేత వైఎస్జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక ఉద్యమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారన్నారు. యువకులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని యువభేరిని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రఘు, నాయకులు సంజు, షాలి, భానుప్రకాశ్, వినోద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాదరణ చూసి ఓర్వలేకనే దాడులు
– గౌరువెంకటరెడ్డి కర్నూలు: జిల్లాలో వైఎస్సార్సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార పక్ష నాయకులు దాడులకు పాల్పడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం చెరుకులపాడులో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరెడ్డి వర్గీయులపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. టీడీపీ నాయకులు చెరుకులపాడు గ్రామంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగించాలి తప్ప దుర్వినియోగానికి పాల్పడటం మంచిది కాదని హితవు పలికారు. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి తన అనుచరవర్గాన్ని ప్రత్యర్థులపై ఎగదోసి దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల మన్ననలు పొందాలి తప్ప దౌర్జన్యం, దాడుల ద్వారా ప్రతిపక్షాలను నీరుగార్చాలని ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. చెరుకులపాడులో జరిగిన దౌర్జన్యకాండపై విచారణ జరిపి బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.