పట్టణంలో 60 అడుగుల రోడ్డులో నివాసముంటున్న ఇస్మాయిల్ (28) అనే లారీ క్లీనర్ ఆదివారం సాయంత్రం భార్యాపిల్లలు బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
లారీ క్లీనర్ బలవన్మరణం
Jul 18 2016 12:54 AM | Updated on Nov 6 2018 7:56 PM
గుంతకల్లు: పట్టణంలో 60 అడుగుల రోడ్డులో నివాసముంటున్న ఇస్మాయిల్ (28) అనే లారీ క్లీనర్ ఆదివారం సాయంత్రం భార్యాపిల్లలు బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు రసూల్ ఇంటికి రాగా అన్న ఉరికి వేలాడుతున్న ఇస్మాయిల్ కనిపించాడు. వెంటనే ఆయను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇస్మాయిల్ ముఖంపైన, చేతులపై ఉన్న గాయాలు అనుమానాలను రేకిత్తిస్తున్నాయి. ఇస్మాయిల్‌కు భార్య మాబున్నీ, ఇద్దరు సంతానం. టూటౌన్ ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement