పొంగిపొర్లుతున్న ‘లక్నాపూర్‌’ అలుగు | laknapur project fulfilled | Sakshi
Sakshi News home page

పొంగిపొర్లుతున్న ‘లక్నాపూర్‌’ అలుగు

Sep 4 2016 6:19 PM | Updated on Mar 28 2018 11:26 AM

పొంగిపొర్లుతున్న ‘లక్నాపూర్‌’ అలుగు - Sakshi

పొంగిపొర్లుతున్న ‘లక్నాపూర్‌’ అలుగు

జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మండలంలోని లక్నాపూర్‌ ప్రాజెక్టు నిండి పొంగిపొర్లుతోంది. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండుకుండలా మారింది.

ఎట్టకేలకు కరువుదీరా వర్షాలు కురిశాయి. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతన్నకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఊరటనిచ్చాయి.. జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మండలంలోని లక్నాపూర్‌ ప్రాజెక్టు నిండి పొంగిపొర్లుతోంది. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండుకుండలా మారింది. కాగా శనివారం రాత్రి కురిసిన వర్షానికి అలుగు పారుతోంది. దీంతో సందర్శకులు లక్నాపూర్‌ ప్రాజెక్టు అలుగు అందాలు చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.                         - పరిగి

Advertisement
 
Advertisement
Advertisement