చికిత్స పొందుతూ కార్మికుడి మృతి | labour dies in hospital | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ కార్మికుడి మృతి

Sep 25 2016 10:45 PM | Updated on Sep 4 2017 2:58 PM

మండలంలోని తూమకుంట పారిశ్రామిక వాడలో తిరుమల స్టీల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు జాహ్వాలాన్‌ ఉపాధ్యాయ్‌ (50) మతి చెందినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ అక్బర్‌ ఆదివారం తెలిపారు.

హిందూపురం రూరల్‌ : మండలంలోని తూమకుంట పారిశ్రామిక వాడలో తిరుమల స్టీల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు జాహ్వాలాన్‌ ఉపాధ్యాయ్‌ (50) మతి చెందినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ అక్బర్‌ ఆదివారం తెలిపారు. వివరాలు.. శనివారం బిహార్‌ రాష్ట్రానికి చెందిన జాహ్వాలాన్‌ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తుండగా మూర్ఛ వ్యాధి రావడంతో హిందూపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తోటి కార్మికులు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు వైద్యులు రెఫర్‌ చేశారు. ఈక్రమంలో బెంగళూరులో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement