రచయితలు డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, డాక్టర్ చింతపల్లి సత్యనారాయణ రచించిన కృష్ణా పుష్కర సౌరభం అనే పుస్తకాన్ని గురువారం కలెక్టర్ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు.
‘కృష్ణా పుష్కర సౌరభం’ పుస్తకావిష్కరణ
Aug 12 2016 4:46 PM | Updated on Sep 4 2017 9:00 AM
గుంటూరు ఈస్ట్ : రచయితలు డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, డాక్టర్ చింతపల్లి సత్యనారాయణ రచించిన కృష్ణా పుష్కర సౌరభం అనే పుస్తకాన్ని గురువారం కలెక్టర్ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన జీవన నది కృష్ణవేణి విశిష్టతను తెలియచెబుతూ నూతన రాజధాని ప్రాంత గ్రామాల చరిత్రను విశ్లేషించి చెబుతున్న గ్రంధం కృష్ణా పుష్కర సౌరభం అని అన్నారు. కృష్ణానది పుట్టుక నుంచి సాగర సంగమం దాకా విశేషాలు, నదుల పవిత్రత, పుష్కర ఆవిర్భావం, పుష్కర నది స్నాన విధులు, పరీవాహక ప్రాంత క్షేత్రాల ప్రాధాన్యతను కళ్లకు కట్టినట్లు రచించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్‌వీఎస్ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యా భవన్ కార్యదర్శి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement